లండన్​లో కొత్త ఇళ్లు కొనుగోలు చేసిన ప్రభాస్?

-

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ మారుతితో కలిసి రాజాసాబ్, ప్రశాంత్ నీల్తో సలార్-2, ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే రాజాసాబ్ వర్కింగ్ షురూ అయింది. ఇక కల్కి షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ గురించి ప్రస్తుతం నెట్టింట ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే?

ప్రభాస్ లండన్‌లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా షూట్స్‌, వెకేషన్స్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారట. దాదాపు రూ.కోటి వరకు అద్దె చెల్లించేవారట. ఇక ఆ ఇల్లు తనకు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి ప్రభాస్ ఆ ఇంటిని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవలే ప్రభాస్ సలార్ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version