సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్.. పెళ్లి కూతురు ఎవరంటే..?

-

తమిళ్ హీరో సిద్ధార్ద్ సీక్రెట్గా వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధార్ద్ ఏడడుగులు వేశాడు. సిద్ధార్థ్, అదితిల వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్లో బుధవారం  జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపించారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షలతో సిద్దార్థ్, అదితిల వివాహం జరిగింది.

సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి గత కొంతకాలంగా రిలేషన్షిప్ ఉన్నారు. ఇటీవలి రోజుల్లో వీరిద్దరూ జంటగా ఫంక్షన్స్ , సినిమాలకి, పార్టీలకి వెళ్లారు. దాంతో పెళ్లి గురించి అడగ్గా.. ఇద్దరు దాటవేస్తూ వచ్చారు. చివరకు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. విషయం తెలిసిన ఫాన్స్ ఈ నూతన జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సిద్ధార్థి ్క అధికారికంగా ఇది రెండో పెళ్లి కాగా.. అదితికి కూడా రెండో వివాహమే. 2003లో మేఘన అనే యువతిని సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2007లో విడిపోయాడు.

వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడి బాధ్యతలను సిద్ధార్థ్ చూసుకుంటున్నాడు. అప్పటినుంచి మరో వివాహం చేసుకోలేదు గానీ.. చాలా మంది హీరోయిన్స్తో ఎఫైర్ నడిపాడు. సోహా అలీ ఖాన్, సమంత కూడా ఆ జాబితాలో ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు అదితిని వివాహం చేసుకున్నాడు. సిద్దార్థ్ అదితి కలిసి మహాసముద్రం చిత్రంలో నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version