ప్రభాస్​ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్.. వరే వరే వరే వచ్చేశాడు ‘రాజాసాబ్’

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్​కు డైరెక్టర్ మారుతి సర్​ప్రైజ్ ఇచ్చారు. మరో 24 గంటల్లో కల్కి మూవీతో థియేటర్లలో సందడి చేయనున్న ప్రభాస్.. ఈ చిత్రం తర్వాత తన నెక్స్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ షూటింగ్​లో బిజీ కానున్నాడు. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ఓ స్వీట్ సర్​ప్రైజ్ ఇచ్చారు.

ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్లు దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్​ తమన్​తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘వరే వరే వరే వచ్చేశాడు రాజా సాబ్’ అనే థీమ్ సౌండ్ క్లిప్‌ను షేర్ చేశారు. దీంతో ఈ ఊహించని సర్‌ప్రైజ్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘ది రాజా సాబ్’లో ప్రభాస్​తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ నిర్మిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version