ప్రభాస్ ఫ్యాన్స్ సరదా తీర్చబోతున్నాడుగా ..!

-

టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్ ఇండియా స్టార్ గా టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రభాస్ ని మాత్రమే పిలుస్తున్నారు. అంతేకాదు మిస్టర్ పర్‌ఫెక్ట్, డార్లింగ్ వంటి సినిమాలతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను బాగా పెంచుకున్నాడు ప్రభాస్. ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికి ప్రభాస్ నటించే సినిమాల నుంచి మాస్‌ ఎలిమెంట్స్ కావాలనుకే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. గతంలో ‘ఛత్రపతి’ లాంటి సినిమాలో ప్రభాస్ లో మాస్ యాంగిల్ ని చూసిన ఫ్యాన్స్ ఆ తర్వాత మళ్ళీ ఆరేంజ్ సినిమా చూడ లేదు. మిర్చీ సినిమా వచ్చింది. ఆ సినిమాతో కొంతవరకు మాస్ ఆడియన్స్ తృప్తి పడ్డారు. కానీ ఫుల్ గా ఎంజాయ్ చేసింది లేదు.

 

ప్రస్తుతం ‘జాన్’ సినిమా పూర్తయిన తర్వాత ఒక ఊర మాస్ కథతో ప్రేక్షకులను ఆనందింపజేయాలని చూస్తున్నాడట. అంటే.. మరోసారి ప్రభాస్‌లో ‘ఛత్రపతి’ని చూస్తారని ఫ్యాన్స్ ఫిక్సవ్వొచ్చు. అయితే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో ప్రభాస్ కమిటయ్యాడని తాజాగా ఒక వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. వాస్తవంగా సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి రెడ్డి వంగ సినిమా తర్వాత తెలుగులో మహేష్ బాబు తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అవి వార్తలు గానే మిగిలిపోయాయి.

ఆ తర్వాత సందీప్ బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ అర్జున్ రెడ్డి సినిమాని మక్కి కి మక్కీగా కబీర్ సింగ్ అన్న పేరుతో తెరకెక్కించాడు. బాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు సందీప్ రెడ్డి వంగ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరో షాహిద్ కపూర్ కి రికార్డ్ సినిమాగా నిలిచింది. దాంతో సందీప్ కి బాలీవుడ్ లో స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇంతలోనే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version