సాయిధ‌ర‌మ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ నుంచి క్రేజీ సాంగ్ వ‌చ్చేసింది..

-

సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంట‌గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా.. ‘ప్రతిరోజూ పండగే’. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని డిసెంబర్ 20 న విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ను విడుదల చేశారు. “కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేసెనుగా .. కనుకేమో తలకిందులుగా పడి మది మది తిరిగెనుగా .. హైరానా పడిపోయా .. హాయిని వదిలిన ఎద వలన .. ఇంకొంచెం అడిగేశా తీయని హాయిని వద్దనక .. యూ ఆర్ మై హై” అంటూ ఈ పాట సాగుతోంది.

యూత్ కి నచ్చేలా ఈ పాటను చిత్రీకరించారు. సింగర్ దీపుతో కలిసి రాశి ఖన్నా ఈ పాట పాడటం విశేషం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర హైలైట్ కానుందని టాక్‌. కాగా, ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version