న్యూఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ గడువు డిసెంబరు 21న ముగియనుంది. సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత, తగిన అనుభవం ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరో నాలుగు రోజుల్లో గడువు ముగీయనుంది. సో.. త్వరపడండి.
పోస్టుల వివరాలు
జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 40 పోస్టులు
విద్యార్హత- డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్), సివిల్ కన్‌స్ట్రక్షన్ విభాగాల్లో మూడేళ్ల అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి- 07.12.2019 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు.. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పోస్ట్ చేయాలి.
ఎంపిక.. రాతపరీక్ష నిర్వహిస్తారు
చివరితేది: 21.12.2019
దరఖాస్తులు.. అభ్యర్థులు దరఖాస్తులు నింపి నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.
చిరునామా:
Career Cell, HR Department,
National Capital Region Transport Corporation,
7/6 Siri Fort Institutional Area,
August Kranti Marg,
New Delhi-110049.