అమ్మాయిల కలల రాకుమారుడు.. నాగ చైతన్య బర్త్ డే స్పెషల్..!

-

నాన్న నటసామ్రాట్ అక్కినేని నాగార్జున.. నటన, స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకుని చిత్రపరిశ్రమలో తనకుంటూ గుర్తింపు సంపాదించుకుని సాగిపోతున్న నాగచైతన్య పుట్టిన రోజు నేడు. కమర్షియల్‌ సినిమాలతోపాటు వాస్తవికత ప్రధానంగా సాగే కథాంశాలతో వైవిధ్యతను చాటుకున్నారు. ఇమేజ్‌లకు కట్టుబడిపోకుండా.. కొత్తదనాన్ని నమ్ముకుని కథలు ఎంపిక చేసుకుంటున్నారు. చైతు చైన్నైలో పుట్టి పెరిగారు.

naga chaithanya

ప్రముఖ నటుడు నాగార్జున, ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటి దంపతులకు నాగచైతన్య జన్మించారు. ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్‌ నాగచైతన్యకు మేనమామ అవుతారు. రానా దగ్గుబాటి, సుమంత్, సుశాంత్‌లు నాగచైతన్యకు కజిన్లు అవుతారు. వీళ్లు కూడా నటులే. నాగచైతన్య బాల్యంలోనే నాగార్జున, లక్ష్మీ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. అమలా ముఖర్జీని నాగార్జున వివాహమాడారు. సుందరం మోటార్స్‌కు కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన శరత్‌ విజయ రాఘవన్‌ను లక్ష్మీ వివాహమాడారు. చైతన్యకు నటుడు అఖిల్‌ అక్కినేని హాఫ్‌ బ్రదర్‌ అవుతారు

నటనను వృత్తిగా ఎంచుకుంటానని కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే తండ్రి నాగ్‌తో చెప్పారట. ఆపై ముంబయిలో మూడు నెలలు యాక్టింగ్‌ కోర్సు చేశారు. లాస్‌ ఏంజెల్స్‌లో నటనతోపాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. నటుడిగా కెరీర్‌ ఆరంభించడానికి ముందే వాయిస్‌, డైలాగ్స్‌ చెప్పడంలో కోచింగ్‌ తీసుకున్నారు.

నూతన దర్శకులతో నేను చేసిన కొన్ని సినిమాలు ఆడలేదు. అలాగని కొత్త దర్శకులపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. దర్శకుల నటుడిగా ఉండటమే నాకు ఇష్టం. నా కెరీర్‌ సెట్‌ అయ్యే వరకు, అనుభవం ఉన్న వారితో పనిచేయడం వల్ల నటన మెరుగుపడుతుందని అనిపించింది. మరో రెండుమూడు హిట్లు అందుకున్న తర్వాత కొత్త వారితో కలిసి పనిచేస్తా’ అని చై ఒక సందర్భంలో వివరించారు.

2017, జనవరి 29న నటి సమంతా రూత్‌ ప్రభుతో నాగచైతన్యకు నిశ్చితార్ధం జరిగింది. చైతన్య, సమంత అక్టోబర్‌ 6న హిందూ సంప్రదాయ ప్రకారం, అక్టోబర్‌ 7న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహమాడారు. ఈ రెండూ ప్రైవేట్‌ వేడుకలే. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకులకు హాజరయ్యారు. అభిమానులు ఈ దంపతులను ‘చే సామ్‌’ అని పిలుస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version