లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడీయన్ పృథ్వీ రాజ్ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. వైసీపీ నేతలను టార్గెట్ చేసినట్టుగా ఉన్న ఆ కామెంట్స్ మీద కలకలం రేగడంతో టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటితో పాటు విశ్వక్ సేన్ మీడియా ముందుకు వచ్చి అసలేం జరిగిందో వివరించారు. తాజాగా ఈ అంశం మీద టీమ్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. లైలా మెగా మాస్ ఈవెంట్ లో నటుడు 30 ఇయర్స్ పృథ్వీ వ్యక్తం చేసిన ప్రకటనలు పూర్తిగా అతని వ్యక్తిగత అభిప్రాయాలు అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయన మాటలు పూర్తిగా వ్యక్తిగతం అని.. సినిమాలో నటించిన నటీనటులు కానీ, షైన్ స్క్రీన్ టీమ్ లేదా టీమ్ ఎవ్వరికీ ఆయన మాట్లాడిన మాటలతో సంబంధం లేదని వెల్లడించారు. మా సినిమా ఎంటర్ టైన్ మెంట్ హ్యుమర్ అలాగే జాయ్ తో కలగలిపిన ఒక వేడుక.. మేము పాజిటివిటీ, అలాగే లవ్ ను వ్యాప్తి చేయడాన్ని గట్టిగా నమ్ముతాము.. మా ఈవెంట్ లో వ్యక్తులు చేసే ఎలాంటి రాజకీయ ప్రకటనలను మేము ఆమోదించం లేదా సమర్థించం అని పేర్కొన్నారు.