OG : పవర్ స్టార్ ‘ఓజీ’లో ప్రియాంక మోహన్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నటిస్తున్న తాజా చిత్రం నుంచి నేడు కీలకమైన అప్ డేట్ వచ్చింది. యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టయినర్ ఓజీ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి సినిమా వర్కింగ్ టైటిల్ ఇదే.

కాగా, ఈ చిత్రబృందం నుంచి నేడు కీలకమైన అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌ ను అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ తమ హీరోయిన్‌ అంటూ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

కాగా, ఓజీ చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో గ్రాండ్ గా ముహూర్తం షాట్ జరుపుకుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో తారాగణం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా దర్శకుడు సుజీత్. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో యాక్షన్ మూవీస్ పై తన పట్టు నిరూపించుకున్నారు. ఇప్పుడు తన మూడో చిత్రాన్ని ఏకంగా పవన్ కల్యాణ్ తో సెట్స్ పైకి తీసుకెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version