స్వలింగ వివాహంపై అలాంటి కామెంట్స్ చేసి ట్రోల్ అవుతున్న కాశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్..

-

ది కాశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. స్వలింగ వివాహం అనేది ‘అర్బన్ ఎలిటిస్ట్’ (తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే వ్యక్తుల) కాన్సెప్ట్ కాదని అన్నారు. తాజాగా ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటే సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఈ కామెంట్స్ చేశారు.

తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే అయితే ఈ విషయాన్ని పలువురు వ్యతిరేకించిన నేపథ్యంలో వివేక అగ్నిహోత్రి స్పందించారు. స్వలింగ వివాహం అనే కాన్సెప్ట్ తప్పే కాదని ఆయన వాదించారు. దీన్ని ఇండియాలో సర్వసాధారణం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంపై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ పై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరిన సంగతి తెలిసిందే. తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే కొందరు వారి అభిప్రాయాలను సమాజం ఆమోదించాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్లు వేశారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలను ప్రస్తుతమున్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాదించింది. ఈ వాదనను వివేక్ అగ్నిహోత్రి వ్యతిరేకించారు.

కాగా వివేక్ అగ్నిహోత్రి వాదనకు నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది వివేక్ వాదనను సరైనదని భావిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కాగా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని గతంలోనూ కొందరు సెలబ్రిటీలు గొంతెత్తారు. బాలీవుడ్ ఫిలిం మేకర్ హన్సల్ మెహతా ఇప్పటికే స్వలింగ వివాహం కాన్సెప్ట్‌పై ‘మోడరన్ లవ్: ముంబై’ అనే ఆంథాలజీని రూపొందించారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని ట్విట్టర్ వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version