హిట్ లేక పోయిన వరుస ఆఫర్స్‌ కొట్టేస్తున్న కోలివుడ్ బ్యూటీ

-

సరైన హిట్‌ లేకపోయినా.. వరుస ఆఫర్స్‌ కొట్టేస్తోంది. డెబ్యూ మూవీ పెద్దగా ఆడకపోయినా.. పక్కింటి అమ్మాయిలా కనిపించి ఇంప్రెస్‌ చేసేసింది. ఇప్పటివరకు యంగ్‌ హీరోలతో నటించిన ఈ అమ్మడిపై స్టార్స్ దృష్టి పడింది. త్వరలో స్టార్‌తో జత కడుతున్న ఈ హీరోయిన్‌ పై కోలివుడ్,టాలీవుడ్ పై పెద్ద చర్చే నడుస్తుంది.

చెన్నయ్‌ చిన్నది ప్రియాంక అరుల్‌ మోహన్‌ను చూసి ఫీలై రచయిత ఇలా రాశాడా? అనిపిస్తోంది. బుట్టబొమ్మలా కనిపించే ప్రియాంక వరుస ఆఫర్స్ అందుకుంటోంది. మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ప్రియాంక కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. రెండో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి..నాని ‘గ్యాంగ్‌లీడర్‌’లో నటించింది.

గ్యాంగ్‌ లీడర్‌ నిరాశపరిచినా.. ప్రియాంక మోహన్‌ మాత్రం అభిమానులను సంపాదించుకుంది. ఈ అందమైన రూపం మరిన్ని ఆఫర్స్‌ తీసుకొస్తున్నాయి. శర్వానంద్‌ నటిస్తున్న ‘శ్రీకాంరం’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘భలేగుంది బాలా’అంటూ ఈ అమ్మడిపై పాడిన పాట సినిమాకు హైప్‌ తీసుకొచ్చింది.

ప్రియాంక తమిళ అమ్మాయే అయినా.. కాస్త లేటుగా.. మదర్ టంగ్‌లో నటించే ఛాన్స్‌ అందుకుంది. గ్యాంగ్‌ లీడర్‌ రిలీజ్‌ తర్వాత తమిళంలో ‘డాక్టర్‌’ మూవీలో శివకార్తికేయతో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ ఇంకా రిలీజ్‌ కాకుండానే.. సూర్యతో నటించే అవకాశం అందుకుంది ప్రియాంక. పాండిరాజన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version