ఫిట్ నెస్ టెస్టు క్వాలిఫై అయ్యేందుకు బీసీసీఐ కొత్త రూల్‌

-

ఆస్ట్రేలియా గడ్డ మీద జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మళ్లీ భారత్‌ టెస్టు సిరీస్‌ ఆడనుంది. అయితే ఈసారి టెస్టు సిరీస్‌ స్వదేశంలోనే జరుగుతోంది. లాక్‌డౌన్‌ అనంతరం మన దగ్గర జరుగుతున్న తొలి అంతర్జాతీయ టెస్టు సిరీస్‌ కాగా ఆ తరువాత ఇంగ్లండ్‌తో భారత్‌ వరుసగా వన్డేలు,  టీ20లు ఆడనుంది.

అయితే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను పక్కకు పెడితే వన్డే, టీ20లలో పాల్గొనదలిచిన క్రికెటర్లకు బీసీసీఐ ఫిట్‌ నెస్‌ విషయంలో కొత్త రూల్ తెచ్చింది. ఇకపై బ్యాట్స్‌మెన్లు అయితే ఫిట్ నెస్‌ టెస్టులో క్వాలిఫై అయ్యేందుకు 2 కిలోమీటర్ల రన్‌ను 8.30 నిమిషాల్లో పూర్తి చేయాలి. బౌలర్లు అయితే 8.15 నిమిషాలు చాలు. ఈ టెస్టులో పాస్‌ అయితేనే ఫిట్‌నెస్‌ ఉందని భావిస్తారు.

ఇక యోయో టెస్టు నిబంధనలను బీసీసీఐ మార్చలేదు. అందులో ప్లేయర్లు పాస్‌ కావాలంటే 17.1 మార్కులను సాధించాలి. కాగా భారత్‌ ఇంగ్లండ్‌తో మొత్తం 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆయా మ్యాచ్‌లో ఆడే ప్లేయర్ల కోసమే ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ టెస్టు క్వాలిఫై నిమిషాలను మార్చింది. ఈ క్రమంలో ఆ టెస్టులో పాస్‌ అయితేనే ప్లేయర్లను బీసీసీఐ మ్యాచ్‌ ఆడేందుకు అనుమతిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version