తెలంగాణలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు.ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆయన ఛాంబర్‌పై పెట్రో బాంబులు విసిరినట్లు తెలిసింది.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలోని రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలిసేలోపే మంటలు దట్టంగా కమ్ముకున్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ మీద పగతోనే ఈ దాడులకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.