టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్… వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్షమాపణలు చెప్పాలని వైసీపీ సోషల్ మీడియా డిమాండ్ చేస్తుంటే.. తాను అస్సలు తగ్గబోనని తాజాగా రెచ్చిపోయి మాట్లాడాడు పృధ్వీరాజ్. హై బీపీ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు పృథ్విరాజ్.
అయితే ఆయన ఆరోగ్యం కాస్త కొలిక్కి రావడంతో మీడియాతో మాట్లాడారు పృథ్వీరాజ్. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులపై బూతులతో రెచ్చిపోయారు పృద్వి. 11 అనే మాట వస్తే వైసిపి వాళ్ళు గజ గజ వనిగిపోతున్నారని చురకలు అంటించారు. వివాదాలకు పోకుండా సినిమాను సినిమాగా చూడాలని కోరారు. అనవసరంగా తన తల్లిని కూడా ఈ వివాదంలోకి లాగారని వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు.
ఇది ఇలా ఉండగా… విశ్వక్ హీరోగా చేసిన లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో.. వైసీపీకి మండిపోయేలా హాట్ కామెంట్స్ చేశారు కమెడియన్ పృథ్వీరాజ్. దీంతో రెచ్చిపోయిన వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ యాక్టివ్ అయింది. పృధ్విరాజ్ ను టార్గెట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పృథ్వీరాజ్ తరఫున విశ్వక్ సారీ చెప్పారు.
400 ఫోన్ కాల్స్ చేసి టార్చర్ పెట్టారు
వైఎస్సార్సీపీ వాళ్ళు రోడ్డు మీద పందులకు పుట్టారా
Video Credits – Studio One https://t.co/yXfoFkTsVi pic.twitter.com/r8edy94OfL
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2025