Punarnavi : టాలీవుడ్ లో మరో నటికి అరుదైన వ్యాధి

-

ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పునర్నవి ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించిన విషయం తెలిసిందే. అందరికీ సుపరిచితులు గా మారిపోయింది. అయితే, కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో సైలెంట్‌ గా ఉన్నా పునర్నవి.. తాజాగా యాక్టివ్‌ అయింది. ఈ నేపథ్యంలోనే తనకు అరుదైన వ్యాధి ఉందంటూ ప్రకటించింది.

తాను కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ షేర్ చేసింది. ‘కొద్దిరోజులుగా ఛాతి సమస్య వ్యాధితో బాధపడుతున్న, నా కొత్త సంవత్సరం ఇలా మొదలైంది.చాలా రోజులు అనారోగ్యంతో బాధపడడం ఇదే మొదటిసారి. ఇదే చివరిసారి కావాలని ఆశిస్తున్న’ అంటూ తన ఫోటో షేర్ చేసింది. అలాగే మరో ఫోటో షేర్ చేస్తూ, ‘ఇప్పటికే అనారోగ్యంగానే’ ఉన్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news