ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప-2 మూవీ నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 28 లేదా 31న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇది ఇలా ఉండగా.. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కూడా బిగ్ షాక్ తగిలింది. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా IT సోదాలు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి సుకుమార్ ను తీసుకెళ్లిన ఐటీ అధికారులు… ఆయన నివాసంలో కూడా IT సోదాలు చేస్తున్నారు.