భారత సినీ చరిత్రలో రికార్డు.. పుష్ప-2 తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే..?

-

ఐకాన్ స్టార్ హీరో అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాను డిసెంబర్ 04న ప్రీమియర్స్ వేశారు. తొలిరోజు ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చాయి. పుష్ప-2 కి సినిమాకి సంబంధించి తొలి రోజు రూ.294 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. భారత సినీ చరిత్రలోనే ఇదే అత్యధికం అంటూ పేర్కొంది.

పుష్ప-2 ఆల్ టైమ్ రికార్డు అంటూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. హిందీలో ఈ సినిమాకు ఫస్ట్ డే రూ.కోట్లు వసూళ్లు వచ్చినట్టు ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్. సినిమాలో యాక్షన్ సీన్లు హైలెట్ గా ఉండటంతో ప్రేక్షకులు సినిమాను చూసేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు పుష్ప2 సినిమాతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news