కొత్త కారు కొన్న రచ్చ రవి.. ఖరీదు ఎంతంటే..?

-

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో బుల్లితెర సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున కార్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది కూడా సెలబ్రిటీలు భారీగానే కార్లు కొనుగోలు చేయడం జరిగింది. అలా కొద్ది రోజుల క్రితం నటుడు వైవా హర్ష, కీర్తి సురేష్ ,బిత్తిరి సత్తి, షణ్ముఖ్ తదితరులు దసరా పండుగ సందర్భంగా కొత్తకారులను కొనుగోలు చేశారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా వీరి జాబితాలోకి మరొక బుల్లితెర కమెడియన్, నటుడు చేరిపోయారు.

ఆ నటుడు ఎవరో కాదు జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రవి జబర్దస్త్ షోని వీడి పలు సినిమాలలో కమెడియన్గా నటిస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు మాత్రం తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. ఆ తరువాత పలు కారణాల చేత మాటీవీలో ప్రసారమవుతున్న పలు షో లలో కమెడియన్ గా చేరారు. ఇక ఒక్కో స్కిట్ కు రూ.2 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా దసరా పండుగ సందర్భంగా రచ్చ రవి నెక్సా గ్రాండ్ వింటారా కారును కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని రచ్చ రవి స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ విషయాన్ని తెలియజేశారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అలాగే ఇన్ని సంవత్సరాలు తనకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని తెలియజేశారు రచ్చ రవి. అయితే రవి కొన్న కారు విలువ దాని ఫీచర్లను బట్టి చూస్తే దాదాపుగా ఈ కారు రూ.18 లక్షల రూపాయలకు పైగానే ఉన్నట్లు సమాచారం. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version