మెజిస్ట్రేట్ ఎదుట తిట్టుకున్న మంచు మనోజ్, మోహన్ బాబు..!

-

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్న మంచు మనోజ్, మోహన్ బాబు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే మెజిస్ట్రేట్ వద్దకు డాక్యుమెంట్స్ తో సహా వెళ్లారు మంచు మనోజ్. కానీ మెజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు పరస్పరం తిట్టుకున్నట్లు తెలుస్తుంది. కొద్ది సేపటి వరకు ఈ ఇద్దరి వాగ్వివాదం సాగినట్టు సమాచారం. కానీ అనంతరం మంచు మనోజ్ , మొహన్ బాబు విచారణ ముగించారు.

అయితే ఆస్తి తగదాకి సంబంధించి ప్రతిమ సింగ్ కు పూర్తి వివరాలు అందజేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బయటకు వచ్చేసారు మోహన్ బాబు, మాంచు మనోజ్. సుమారు రెండు గంటల పాటు ఈ మెజిస్ట్రేట్ విచారణ సాగింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన మంచు మనోజ్ మీడియాతో మాట్లాడకుండా ఆవేశంగా వెళ్లిపోయారు. ఇక వచ్చే వారం మరోసారి విచారణ హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version