పాన్ ఇండియా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మార్చి 11న పాన్ ఇండియా రెంజ్ లో విడుల అయింది. అయితే ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక పోయింది. ప్రేమ కథ అయినా.. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఈ సినిమా జీర్ణించుకోలేక పోయారు. ఎన్నో అంచనాలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా చూస్తే.. వారికి నిరాశే మిగిలింది. అయితే ప్రేమ కథలు కూడా హిట్ అయినా.. చరిత్ర సినీ ఇండస్ట్రీలో ఉంది. కానీ రాధే శ్యామ్ కు ఎందుకు నెగిటివ్ టాక్ వచ్చింది.. అనే ప్రశ్న మాత్రం సినీ విశ్లేషకులకు, ప్రభాస్ ఫ్యాన్స్ కు వస్తుంది.
అయితే ఈ సినిమాలో ముఖ్యమైన మైనస్ పాయింట్.. పాటలు అని చెప్పవచ్చు. కథనే స్లో అనుకుంటే.. పాటలు కూడా స్లో గానే ఉన్నాయనే భావన ప్రేక్షకులకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా పాటలు ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోయాయి. అయితే సినిమాలో సందర్భాన్ని బట్టి చూస్తే.. పాటలు బాగానే ఉంటాయని అనుకున్నారు. కానీ సినిమాలో కూడా అదే తీరు ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి కాక తప్పలేదు.
అయితే ఒక సినిమా హిట్ కావాలంటే.. పాటలు కూడా సూపర్ హిట్ కావాలి. ఇది ప్రభాస్ కు ఇది వరకే తెలుసు. గతంలో వచ్చిన సాహో సినిమాలో కూడా పాటలు హిట్ కాక పోవడంతో సినిమా కూడా.. నెగిటివ్ టాక్ వచ్చింది. సాహో సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతాన్ని అందించినా.. ఫలితం లేకపోయింది. దీంతో సాహో సమయంలో పాఠాలు నెర్చుకోలేదా.. అని సినీ విశ్లేకులు ప్రభాస్ ను ప్రశ్నిస్తున్నారు.