మందు(ఆల్కాహాల్) తాగితే తప్పా.. ఎంత మంది తాగడం లేదు. ఆ తప్పు నేనొక్కదాన్నే చేసానా? అందుకని సినిమా నుంచి నిర్ధాక్షణ్యంగా తరిమేస్తారా? అంటూ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే ఓ దర్శక, నిర్మాతని బంతాడేసింది. ఏ విషయంపైనైనా అమ్మడు బోల్డ్ నెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్ర్కీన్ పై ఎంత బోల్డ్ గా నటిస్తుందో….అంతే బోల్డ్ గాను బయటా మాట్లాతుంది. అమ్మడు బాలీవుడ్ లో ఆ రకంగానే బాగా ఫేమస్ అయింది. తెలుగులో అవకాశాలు లేకపోయినా..బాలీవుడ్ లో చిలవలు ఫలవలుగా సినిమాలు చేస్తున్నా…వెబ్ సిరీస్‌లతో మాత్రం అమ్మడు ఫుల్ బిజీ. సినిమాల ద్వారా వచ్చే పారితోషికం కన్నా వెబ్ సిరీస్ ద్వారా రెట్టింపు సంపాదిస్తోంది.
అయితే ఆమె జీవితంలో ఓ చేదు సంఘటన గురించి ఓ ఇంటర్వూలో ఇలా ఆసక్తికరంగా మాట్లాడి వార్తల్లోకి ఎక్కేసింది. అసలు విషయానికి వెళ్లే విక్కడీ డోనర్ చిత్రంలో ముందుగా రాధికా ఆప్టేనే హీరోయిన్ గా తీసుకున్నారుట. అయితే షూటింగ్ ప్రారంభానికి ఎక్కువ సమయం ఉండటంతో విదేశీ టూర్లు వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసిందిట. స్నేహితులతో కలిసి ఆల్కాహాల్ తీసుకోవడం..బీర్లు తాగడం..ఆయిల్ ఫుడ్ తినడం వంటిటి హద్దు మీరి చేసిందిట. దీంతో షూటింగ్ స్టార్ట్ అయ్యే సరికి బాగా లావెక్కిందట. ఈ నేపథ్యంలో విక్కీ డోనర్ చిత్ర దర్శక, నిర్మాతలు వాళ్లు అనుకున్న పాత్రకు అమ్మడు సెట్ అవ్వదని సినిమా నుంచి తొలగించారుట. సన్నబడటానికి సమయం ఇవ్వండని రాధిక ఎంత ప్రాధేయ పడినా టైమ్ ఇవ్వలేదుట.
కమిట్ మెంట్, డెడికేషన్ లేని నటివని తిట్టిపోసారుట. ఆ సమయంలో కోపం వచ్చినా అణిగి ఉందిట. తప్పంతా తనవైపే ఉంది కాబట్టి మౌనంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. అప్పటి నుంచి బీరు బాటిల్..తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోందిట. అదీ మ్యాటర్. ఆ పాత్రకు రాధికా ఆప్టే పాత్రలోనే యామీ గౌతమ్ ని ఎంపిక చేసారు. ఆ సినిమా బాలీవుడ్ పెద్ద విజయం సాధించింది. అందులో నటీనటులకు మంచి పేరు కూడా వచ్చింది. అందుకే ఏ రంగంలోనైనా కమిట్ మెంట్, డెడికేషన్ ఉండాలంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా లాభం లేదు కదా.