రాష్ట్ర ప్రజలను మరోసారి చంద్రబాబు నాయుడు మోసం చేసాడు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు, కూటమి ప్రభుత్వం.. ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే ప్రజలు తమ కాలర్ పట్టుకోవచ్న నారా లోకేష్ ఇప్పుడేం చెప్తారు. చంద్రబాబు సీఎం అయితే పులి నోట్ల తల పెట్టినట్లే అని ఎన్నికల ముందే చెప్పిన జగన్.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలలో చేసిన 1.19 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఏ ఒక్క హామీలను నెరవేర్చలేదు.
వాలంటీర్లకు పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి వాళ్ళ గొంతు కోసిన కూటమి ప్రభుత్వం..వైసీపీ హయాంలో రెండున్నరేళ్లు కోవిడ్ ఉన్నా ఏ ఒక్క సంక్షేమ పధకం ఆపలేదు. జగన్ ప్రభుత్వ రంగంలో నిర్మాణాలు చేపట్టిన మూడు పెద్ద పోర్టులు, హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్న చంద్రబాబు.. ఎన్నికల ముందు రాష్ట్రం శ్రీలంక గా మారిపోతుందన్న చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తారు అని వెలంపల్లి పేర్కొన్నారు.