ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టింది వైసీపీనే : మంత్రి అనగాని

-

మదనపల్లె తాసిల్దార్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుంది. మదనపల్లె భూముల అవినీతి పై ఇరువర్గల నుండి ఫిర్యాదులు వచ్చాయి.. రెండింటినీ విచారిస్తున్నం అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. త్వరలో ఆ విషయంలో యాక్షన్ ఉంటుంది. పెద్దిరెడ్డి భూ కబ్జాలు గురించి అందరికీ తెలింది. మంత్రి గా ఉన్నప్పుడు ప్రభుత్వాని వాడుకుని జిల్లాతో ఇతర జిల్లాలలోను భూము కబ్జాలు చేసాడు. మంగపేట అటవీ భూములు పెద్దిరెడ్డి దేనికి వాడుకుంటున్నారో అర్దం కావడం లేది‌…గెస్ట్ హౌస్ కోసమా లేక ఎర్రచందనం అక్రమ రావాణా వాడుకుంటున్నారు ఎమో..?

మంగళం పేట అటవీ శాఖ భూఅక్రమాక్రమాలపై రెండు వారాల వ్యవధిలో నివేదిక వస్తుంది. అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబంపైనా చర్యలు ఉంటాయి‌. మదనపల్లె సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాద ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతున్నాయి. అన్యాయం అటవీ భూములను దోచుకున్నారు.. అది‌ఎమీ కష్టపడి సంపాదించుకుంది కాదు‌. పేదవారు,ప్రభుత్వ భూములను అడగా దోచుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందే వైసీపీ. వారు పెట్టిన అప్పులను మేము కడుతున్నాం అని మంత్రి అనగాని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version