పిల్లల్ని కనడం కంటే కుక్కను పెంచుకోవడం మేలు : కన్నడ నటి హితా చంద్రశేఖర్

-

ఈ మధ్య పలువురు సెలబ్రిటీలు ఫేమస్ కావడానికే లేక మరేదానికో తెలియదు.. కానీ కాంట్రవర్స్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌన్ భారత్ ఫస్ట్ ప్రధాని నేతాజీ సుభాస్ చంద్రబోస్ అని పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మరో కన్నడ నటి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ముఖ్యంగా మాతృత్వం పై కన్నడ నటి హితా చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మీకు పెళ్లై నాలుగేళ్లు అవుతున్నా ఎందుకు పిల్లలను కనలేదు..? అనే ప్రశ్నకు ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. “నాకు పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు. ఈ విషయంలో భర్త మద్దతు కూడా ఉంది. నా దృష్టిలో సొంతంగా పిల్లల్ని కనడం కన్నా ఓ కుక్క పిల్లని కూడా సొంత బిడ్డలా పెంచుకోవచ్చు. ఇక వృద్ధాప్యం గురించి నాకు ఏ మాత్రం బాధలేదు” అని చెప్పుకొచ్చారు నటి హితా చంద్రశేఖర్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version