శనివారం తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఈ నెల 15 నుంచి థియేటర్లు రీఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీతో థియేటర్లని రీఓపెన్ చేయబోతున్నారు. ఈ నిర్ణయమే స్టార్ డైరెక్టర్ రాజమౌళికి నచ్చడం లేదు. దీనిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవడం కంటే వంద శాతం ఎప్పుడు తెరవచ్చో అప్పుడే థియేటర్లు తెరిస్తే మంచిదని ఎగ్జిబిటర్లకి షాకిచ్చారు.
నచ్చిన సినిమా వస్తే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్నారు. ఇక పారితోషికాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పారితోషికాలని 20 శాతం తగ్గించుకోవడానికి నటీనటులతో పాటు టీమ్ అంతా సిద్ధంగా వుంటారని చెప్పిన జక్కన్న అయితే అది సినిమా సినిమాకీ మారుతూ వుంటుదని చెబుతున్నారు. పారితోషికం విషయంలో అందరికీ ఒకే రూలు సరికాదని ఒక ప్రాజెక్ట్ సెట్ కావడం వెనక చాలా కారణాలు వుంటాయని ఇప్పుడు కరోనా వచ్చిందని పారితోషికాల గురించి చర్చ అనవసరం అన్నారు. దీంతో ఎగ్జిబిటర్లతో పాటు ఆర్టిస్ట్లు కూడా షాక్ కు గురవవుతున్నారు.