అల్లు అర్జున్‌తో రాజ‌మౌళి సినిమా ఫిక్స్!.. ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్

-

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మోస్ట్ స‌క్సస్ ఫుల్ డైరెక్ట‌ర్ అంటే.. ట‌క్కున గుర్తుచ్చే పేరు ఎస్ ఎస్ రాజ‌మౌళి. రాజ‌మౌళి చేసిన బాహుబ‌లి – 1, బాహుబ‌లి -2 తో పాటు చ‌త్ర‌ప‌తి, య‌మ‌దొంగ కాకుండా.. అనేక సినిమాలు సూప‌ర్ హిట్ అయినవే. దీంతో ఆయన తో సినిమా చేయ‌డానికి చాలా మంది స్టార్ హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎస్ ఎస్ రాజ‌మౌళి ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు.

దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25 వ తేదీన విడుద‌ల కాబోతుంది. కాగ ఈ సినిమా విడుద‌ల కాక ముందే.. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ప్రిన్స్ మ‌హేశ్ బాబుతో చేయ‌నున్నారు. కాగ ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఏ హీరోతో .. అనే ప్ర‌శ్న సినీ ఇండ‌స్ట్రీని ఊపేస్తుంది. అయితే రాజ‌మౌళి తర్వాతి సినిమాలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని ఫిక్స్ అయిపోంద‌ని తెలుస్తుంది. కాగ రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మ‌హేశ్ బాబు సినిమాతో బిజీగా ఉంటారు.

కాగ అల్లు అర్జున్ ఇప్ప‌టికే పుష్పా పార్ట్ 2 లో బిజీ గా ఉన్నారు. కాగ దీని త‌ర్వాత 2023 లో రాజ‌మౌళి, అల్లు అర్జున్ క‌ల‌యిక‌లో సినిమా ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తుంది. కాగ వీరి సినిమా కోసం ట్విట్ట‌ర్ లో కూడా ట్రెండింగ్ న‌డుస్తుంది. #AlluArjunWithSSR అనే హ్యాష్ ట్యాగ్ తో బ‌న్నీ, రాజ‌మౌళి ఫ్యాన్ ట్రెండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news