నా తర్వాత సినిమా మహేష్ తో; రాజమౌళి…!

-

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కి రంగం సిద్దమైంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రాజమౌళినే స్వయంగా చేసారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేసే సినిమా విషయంలో సర్వత్రా ఆసక్తి ఉంది. ఆ తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు ఆరు నెలల తర్వాత దీనిపై ప్రకటన వచ్చింది.

ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న ఎవరితో సినిమా చేస్తాడు అనే దానిపై అనేక వార్తలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి రెండేళ్ళు గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని భావించారు. కాని జక్కన్న మాత్రం తన తర్వాతి సినిమా మహేష్ తో ఉంటుంది అని తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ప్రకటించారు.

ఈ సినిమాకు నిర్మాతగా దీనికి కె.ఎల్‌.నారాయ‌ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ట‌. ఈ సినిమా కథ గురించి తన తండ్రి తో చర్చలు జరుపుతున్నా అని చెప్పారు జక్కన్న. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై పూర్తిగా స్పష్టత లేదు. ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహేష్ పరుశురాం తో సినిమా తర్వాత ఈ సినిమా చేయనున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version