సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుూ.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కూలీ. సన్ పిచ్చర్స్ నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమీర్ ఖాన్, నాగార్జున, శృతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్.. లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే కూలీ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ కాగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఒకడు పుట్టగానే.. వాడు ఎవ్వడి చేతిలో చావాలన్నది తలమీద రాసి పెట్టి ఉంటది అనే డైలాగ్ రజినీ కాంత్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.ఇందులో అమీర్ ఖాన్, నాగార్జున ఎంట్రీ ఆకట్టుకుంటుంది. అలాగే ఇక్కడ ఉన్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలీ. ఇక యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా కనిపించాయి. యాక్షన్ తో పాటు సెంటిమెంట్ ను కూడా జోడించారు. ఈ ట్రైలర్ అదుర్స్ అనేలా ఉంది. ఈ ట్రైలర్ ను చూస్తుంటేనే రజినీకాంత్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టే అనిపిస్తోంది.