రజిని, అజిత్ బాక్సాఫీస్ ఫైట్..!

-

కోలీవుడ్ లో ఈ సంక్రాంతికి బిగ్ ఫైట్ జరుగనుందా అంటే అవుననే అంటున్నాయి తమిళ సిని వర్గాలు. సూపర్ స్టార్ రజినికాంత్ పెట్ట, తల అజిత్ విశ్వాసం రెండు ఒకే రోజు రిలీజ్ లాక్ చేశాయి. అది కూడా సంక్రాంతి సీజన్ కావడంతో ఎవరు వెనక్కి తగ్గట్లేదట. జనవరి 10న పెట్ట రిలీజ్ అంటుండగా అజిత్ విశ్వాసం కూడా అదే రోజు రిలీజ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే నడిఘర్ సంఘం తరపున విశాల్ పెట్ట, విశ్వాసం దర్శక నిర్మాతలను కలిసి సంధి కుదిర్చే మార్గం చేసినా ఎవరు వినట్లేదట.

సో కోలీవుడ్ లో జనవరి 10న బాక్సాఫీస్ దగ్గర రజిని, అజిత్ బలాబలాలు తేల్చుకోనున్నారు. రజినితో పాటుగా కోలీవుడ్ లో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. అయితే సంక్రాంతి వరుస హాలీడేస్ కాబట్టి రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు వచ్చినా పెద్దగా నష్టమేమి ఉండదని అంటున్నారు. నిర్మాతలు బాగున్నా డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం సినిమా రిలీజ్ ను ముందు వెనక్కి జరిపేలా ప్రయత్నిస్తున్నారట. మరి అది సాధ్యమయ్యే పనేనా కాదా అన్నది కొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version