Jailer : రికార్డ్ సృష్టించిన జైలర్.. 4 రోజుల్లో రూ.300కోట్లు

-

కోలీవుడ్​ సూపర్​ స్టార్​ రజనీకాంత్- నెల్సన్​ దిలీప్​ కుమార్ కాంబోలో విడుదలైన లేటెస్ట్ మూవీ ‘జైలర్’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం తమిళంలోనే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నీరాజనం పడుతున్నారు. సూమారు 7000 స్క్రీన్‌లపై మొన్న గురువారం గ్రాండ్​గా రిలీజైన ఈ మూవీ అద్భుతమైన ఓపెనింగ్‌తో బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కాగా.. తెలుగులోనూ తొలిరోజు కలెక్షన్స్​ అంచ‌నాల‌కు మించి రాబ‌ట్టింది. అయితే..రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లోనే రూ. 300 కోట్ల కలెక్షన్లను దాటేసింది. రోబో 2.0 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో తమిళ చిత్రంగా నిలిచింది. అలాగే తమిళనాడులోని రూ. 100 కోట్ల కలెక్షన్లను దాటేసింది. అక్కడ తొలి రోజు రూ. 29 కోట్లు, రెండో రోజు రూ. 20 కోట్లు, మూడో రోజు రూ. 26 కోట్లు రాగా, నిన్న ఆదివారం ఏకంగా రూ. 31 కోట్లు వసూలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news