స‌డ‌న్ షాకిచ్చిన ర‌కుల్ ప్రీత్‌సింగ్‌!

మాల్దీవ్స్ భార‌తీయ సినీ స్టార్ల‌కి ఈ పాండె‌మిక్‌లో ఫేవ‌రేట్ హాలీడే స్పాట్‌గా మారింది. ఇటీవ‌ల నచ్చిన వ్య‌క్తి గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ హ‌నీమూన్ కోసం ఇదే ప్లేస్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన విష‌యం తెలిసిందే. మాల్దీవుల్లో భ‌ర్త‌తో క‌లిసి కాజ‌ల్ హ‌నీమూన్ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకుంది.

అంత‌కు ముందు తాప్సీ, దిశా ప‌టాని, వేదిక బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ కూడా ఇక్క‌డ దీవుల్లో విహ‌రిస్తూ బికినీ ధ‌రించి హ‌ల్‌చ‌ల్ చేసింది. తాజాగా ర‌కుల్ ప్రీత్‌సింగ్ కూడా మాల్దీవ్స్‌లో ల్యాండై పోయింది. అక్క‌డి దీవుల్లో బికినీ ధ‌రించి సంద‌డి చేస్తూ స‌డ‌న్ షాకిచ్చింది. గ్రీన్ క‌ల‌ర్ బికినీ ధ‌రించి చ‌ల్ల‌ని సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తూ ఊహ‌ల్లో తేలిపోతోంది.

అదే ఫొటోని ఇన్ స్టా వేదిక‌గా అభిమాన‌లుతో పంచుకుంది. `సముద్రం వాసన, ఆకాశాన్ని అనుభూతి చెందండి, మీ ఆత్మ మరియు ఆత్మ ఎగరనివ్వండి` అంటూ త‌న షేర్ చేసిన ఫొటోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ర‌కుల్ షేర్ చేసిన ఫొటో ఇన్ స్టాలో సంద‌డి చేస్తోంది. ఇటీవ‌లే క్రిష్ రూపొందిస్తున్న మూవీ షూటింగ్‌ని పూర్తి చేసిన ర‌కుల్ తాజాగా బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్‌ని సొంతం చేసుకుంది. అజ‌య్‌దేవ్‌గ‌న్‌తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఇందులో న‌టించ‌నున్నారు.