‘RRR’ మధ్యలో వేరే సినిమా కి సంతకం పెట్టిన చరణ్ – షాక్ అయిపోయిన రాజమౌళి !!

-

‘బాహుబలి’ తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి నందమూరి మరియు మెగా కుటుంబాలకు చెందిన స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ప్రేక్షకులలో అదేవిధంగా అభిమానులలో అంచనాలు బీభత్సంగా ఉన్నాయి.

అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సందర్భంలో ఇద్దరు హీరోలకు గాయాలు కావడంతో చాలా రోజులు షూటింగ్ ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి అనుకున్న టయానికి ఈ ఏడాది జులై చివరి మాసంలో విడుదల చేయాలని సినిమాకి సంబంధించి అన్ని షెడ్యూల్స్ చకచకా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.

 

ఇటువంటి నేపథ్యంలో ‘RRR’ మధ్యలో వేరే సినిమా కి రామ్ చరణ్ కమిట్ అయినట్లు దీంతో రాజమౌళి షాక్ అయిపోయినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. విషయంలోకి వెళితే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే స్టోరీ పరంగా సినిమాలో చిరంజీవి యువకుడిగా వున్నప్పటి పాత్రలో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం చరణ్ 40 రోజులను కేటాయించినట్టుగా చెబుతున్నారు. అయితే ఆ 40 రోజులు మాత్రం రాజమౌళి ఎన్టీఆర్ తో తీసే షెడ్యూల్ సమయంలోనే రామ్ చరణ్ కొరటాల సినిమాకి కమిట్ అయినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.  

Read more RELATED
Recommended to you

Exit mobile version