సినీ ఇండస్ట్రీలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మల్టీస్టారర్ ట్రెండ్‌కు బీజం వేస్తుందని ఈ సినిమా విజయం చూసిన పలువురు అభిప్రాయపడుతున్నారు. సూపర్ స్టార్స్ అందరూ కూడా ఇటువంటి పిక్చర్స్ చేయడానికి ముందుకు వస్తారని, అందుకు దారి రాజమౌళి వేశాడని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం ద్వారాలో తమలోని అద్భుతమైన నటనను మరోసారి వెండితెరపైన ఆవిష్కరించారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.
అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీంగా తారక్.. సినిమాలో నటించగా, వారి పర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రాన్ని చూసేందుకు సినీ లవర్స్, ప్రజలు మళ్లీ థియేటర్స్ బాట పడుతున్నారు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో ఓటీటీలు పుట్టుకొచ్చాయి. కొద్ది నెలల పాటు థియేటర్స్ క్లోజ్ అయ్యే ఉన్నాయి. దాంతో ఇక టాకీసులకు పూర్వ వైభవం వస్తుందా? అనే ప్రశ్నార్థక పరిస్థితులూ ఏర్పడ్డాయి. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద చిత్రం విడుదలైన నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ సక్సెస్‌ను ప్రతీ ఒక్కరు తెలుగువాడి సక్సెస్‌గా, ఇండియన్ గా గర్వించాలని అంటున్నారు. కాగా, ఈ చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మరో రికార్డు సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ ద్వారా డబుల్ హ్యాట్రిక్ విజయాలను తారక్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, చరణ్‌కు మాత్రం ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ గానే ఉంటుంది.
ఆయన నటించిన గత చిత్రం ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. తారక్‌కు మాత్రం అలా కాదు గత చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ‘టెంపర్’ చిత్రం నుంచి మొదలుకుని ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఆరు సినిమాలు వరుసగా విజయాలే సాధించాయి. అలా తారక్ ఖాతాలో సక్సెస్‌లు నమోదయ్యాయి.