తెలంగాణలో త్వరలోనే క్రీడా పాలసీ ని తీసుకు వస్తాo : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే క్రీడా పాలసీని తీసుకువస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటన చేశారు. వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలపై దృష్టి పెట్టాలి..కేంద్రం, రాష్ట్రంలో ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి స్టేడియం మంజూరు చేశారని…ఇప్పటికే 40 స్టేడియాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.

నిపుణులైన క్రీడాకారుల సలహాలు తీసుకొని క్రీడా పాలసీ తీసుకొస్తాం..రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి అద్వాన్నంగా ఉండేదన్నారు. ఇపుడు ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం..140 కోట్ల ఉన్న ఈ దేశం చిన్న మెడల్స్ తో సరిపెట్టుకుంటున్నామని వెల్లడించారు. కేంద్రంలో క్రీడా పాలసీ తీసుకురావాలి..ప్రతి స్కూల్ లో గ్రౌండ్ ఉండాలని పాలసీలో మెన్షన్ చేస్తున్నామని వెల్లడించారు.రాబోవు రోజుల్లో గ్రామీణ, మండల, జిల్లా, రాష్ర్టంలో సీఎం కప్ పేరునా పోటీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నా అని అన్నారు.  హైదరాబాద్ తరహాలో వరంగల్ ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారనీ తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version