రివ్యూ : జక్కన్న చెక్కిన “సీతా రామ రాజు”.. రాబిన్ హుడ్ చరణ్!

-

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రారంభించే సమయంలో ఓ మీడియా సమావేశంలో దర్శకధీరుడు జక్కన్న కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. అందులోంచి ఒకటి.. తాను మామూలు హీరోలనే సూపర్ హీరోలుగా చూపిస్తానని, అలాంటిది రియల్ హీరోస్‌ను ఇంకెలా చూపిస్తానో మీ ఊహకే వదిలేస్తున్నా.. అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తాజాగా అదే నిజమైంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను చూసిన వారెవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.

ఎన్టీఆర్ గంభీరమైన స్వరంతో చెప్పిన వాయిస్ ఓవర్.. కనబడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటది.. కలబడితే వేగుచుక్క ఎగబడినట్టు ఉంటది.. ఎదురుపడితే సావుకైనా చెమట దారపడతి.. బాణమైనా బంధూకైనా వానికి బాంచన్ అయితది.. ఇంటి పేరు అల్లూరి సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు.. అన్ని ఒక్కో డైలాగ్ చెబుతూ ఉంటే దాని బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.

అల్లూరి సీతారామరాజును కొత్త కోణంలా ఇది వరకెన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నాడు మన జక్కన్న. రంగస్థలాన్ని మించి నటించినట్టు కనిపిస్తోంది. నటనలోనూ, బాడీ లాంగ్వేజ్‌లోనూ చరణ్‌ను జక్కన్న మరింత చెక్కినట్టు కనిపిస్తోంది. అల్లూరిగా రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్‌పై అగ్గి రాజేయడమే తరువాయి. మొత్తానికి రామ్ చరణ్‌కు అదిరిపోయే గిప్ట్ ఇచ్చేశాడు ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version