దేశంలో లాక్ డౌన్ ని పొడిగించే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు చూస్తే 800లకి దగ్గరలో ఉన్నాయి. ఊహించని విధంగా ఈ కేసులు నమోదు కావడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపధ్యంలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా కట్టడి కావాలి అంటే లాక్ డౌన్ పెంచడమే ఒకటే మార్గం అని కేంద్రం భావిస్తుంది. అందుకే ఇప్పుడు ఏప్రిల్ 15 వరకు విధించిన లాక్ డౌన్ ని మరిన్ని రోజులు పెంచే ఆలోచనలో ఉంది కేంద్ర సర్కార్. ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం, ఇంకా ఎంత మందికి బయటపడుతుందో అర్ధం కాకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ పై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అందుకే కేంద్ర ప్రభుత్వ౦ మూడు నెలలకు సరిపడా ప్యాకేజి లో ప్రజలకు ఆర్ధిక సహాయం చేయడానికి నిర్ణయం తీసుకుందని రిజర్వ్ బ్యాంకు కూడా మూడు నెలలకు సరిపడానే ఈ నిర్ణయాలు తీసుకుందని అందరూ భావిస్తున్నారు. ఆర్బిఐ తీసుకున్న వాయిదా చెల్లింపులు, సహా మరికొన్ని నిర్ణయాలు ఇలాగే ఉన్నాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.