Acharya: రామ్ చరణ్ కెరీర్‌లో మరో బెస్ట్ రోల్ ‘సిద్ధ’..ఇవిగో సాక్ష్యాలు!

-

టాలీవుడ్ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నటుడిగా తనను తాను సినిమా సినిమాకు ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. ‘రంగస్థలం’లో తన నట విశ్వరూపం చూపి ప్రేక్షకులను ఫిదా చేసిన మెగా పవర్ స్టార్..RRR పిక్చర్ లో వేరియేషన్స్ చూపించి వావ్ అనిపించారు. ఇక ఈ నెల 29న విడుదల కానున్న ‘ఆచార్య’తో మరోసారి ప్రేక్షకులను ఫిదా చేయనున్నారు.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ ఫిల్మ్ లో ‘సిద్ధ’ గా ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశాడు చరణ్. తండ్రి మెగాస్టార్ తో కలిసి ఈ సినిమాలో చిందేసిన చరణ్…తన నట విశ్వరూపం చూపించనున్నారు. ఈ పాత్రలో రామ్ చరణ్ తనదైన వేరియేషన్స్ తో అదరగొడతారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఫొటోలు చూస్తుంటే వావ్..అనిపిస్తున్నది. ఓ వైపు సాఫ్ట్ గా ఉన్న గురుకుల్ బాయ్ గా కనిపిస్తూనే మరో వైపున ఇంటెన్స్ రోల్ ప్లే చేసే నక్సలైట్ గా రామ్ చరణ్ కనిపిస్తున్నారు.

అలా రామ్ చరణ్ తండ్రిని మించిన పర్ఫార్మెన్స్ డెఫినెట్ గా సినిమాలో ఇవ్వబోతున్నాడని మెగా అభిమానులు అనుకుంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

రామ్ చరణ్ నెక్స్ట్ ఫిల్మ్ RC15లోనూ వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తుండటం గమనార్హం. IPS , IAS ఆఫీసర్ గా రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇటీవల లీక్ చేశారు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బ్యూటిఫుల్ కియారా అద్వానీ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version