రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే…ప్రస్తుతం ప్రభాస్… వరుస సినిమాలతో దూసు కువెళుతున్నాడు.. నేషనల్ స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఆది పురుష్ కు ఇటీవలే అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఈ సినిమా జూన్ 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ చే స్తూ… సినిమాపై ఆత్రుతను పెంచుతోంది. ఇప్పటికే సినిమా ట్రైలర్, జైశ్రీరామ్ సాంగ్ రిలీ జ్ కాగా… ఆది పురుష్ పై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని రామ్ సీతా రాం సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు అధికారిక పోస్ట్ ద్వారా తెలిపారు.