Ram Charan: ట్రెండ్ సెట్టర్ రామ్ చరణ్.. ఆయన బాటలో ప్రభాస్, రవితేజ, నాని, అల్లు అర్జున్..

-

‘నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా’ ఈ మాటలు.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని ఈ డైలాగ్స్ తమ అభిమాన హీరో జనసేనానికి వర్తిస్తాయని పవన్ అభిమానులు చెప్తుంటారు. కాగా, ఆ మాటలు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు కూడా వర్తిస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే చరణ్ క్రియేట్ చేసిన ట్రెండ్ ను ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలు ఫాలో అవుతున్నారు.

తెలుగు చిత్రసీమలో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన హీరో రామ్ చరణ్ అని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు. మెగా పవర్ స్టార్ అయి ఉండి డీ గ్లామర్ రోల్ ప్లే చేసేందుకు రెడీ అవడమే కాదు.. ఆ రోల్ ప్లే చేసి తన సత్తా ఏంటో బాక్సాఫీసు వద్ద చూపించాడు చరణ్. ‘రంగస్థలం’ చిత్రంతో తనలోని నట విశ్వరూపాన్ని చెర్రీ తెరపైన ఆవిష్కరించాడు. కరోఠ వాస్తవికతను ప్రతిబింబించేలా రా ఫిల్మ్ ను క్రియేటివ్ గా తెరకెక్కించారు దర్శకులు సుకుమార్.

అలా అటువంటి జోనర్ ఫిల్మ్ కు రామ్ చరణ్, సుకుమార్ కలిసి పునాది వేశారని అనొచ్చు. ఆ ఊరమాస్ ట్రెండ్ ప్రజెంట్ కొనసాగుతుండటం విశేషం. గతేడాది విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో ఐకాన్ స్టార్ డీ గ్లామర్ రోల్ ప్లే చేశాడు. ‘పుష్ప’ పార్ట్ టూ కోసం సినీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు కూడా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా డీ గ్లామర్ రోల్ చేయబోతున్నారు.

‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ‘సలార్’ ఫిల్మ్ లో ప్రభాస్ డీ గ్లామర్ ప్లస్ రస్టిక్ రోల్ ప్లే చేయబోతున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నేచురల్ స్టార్ నాని కూడా రస్టిక్ అండ్ రా రోల్ ప్లే చేయబోతున్నారు.

‘దసరా’ చిత్రంలో నాని లుక్ చూస్తే అది మరొక ఊరమాస్ లుక్ అని మీకు అనిపిస్తుంది. మాస్ మహారాజ రవితేజ కామెడీ ప్లస్ సీరియస్ రోల్స్ ప్లే చేస్తుంటారు. కాగా, ఆయన కూడా ఊరమాస్ రోల్ ప్లే చేసేందుకు రెడీ అయిపోయారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఆయన ఊరమాస్‌ పాత్ర పోషించనున్నారు. అలా ప్రజెంట్ టాలీవుడ్‌లో ఊర మాస్‌ ఫిల్మ్స్ తెరకెక్కుతుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version