రాజేంద్రప్రసాద్ ను అవమానించిన రామోజీరావు.. కారణం..?

-

ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది సీనియర్ హీరోలు గతంలో ఎంతో మంది దగ్గర అవమానించబడ్డవారు. అంతేకాదు ఒకానొక సమయంలో ఛీ కొట్టించుకున్న వాళ్లు కూడా నేడు దేశం గర్వించదగ్గ నటులుగా ఎదిగారు అంటే వారి కృషి, పట్టుదల ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి వారిలో నట కిరీట రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. ఈయన ఒకానొక సమయంలో ప్రముఖ నిర్మాత రామోజీరావు చేత ఘోరంగా అవమానించబడ్డారట. ఇక అసలు విషయంలోకి రాజేంద్రప్రసాద్ అప్పట్లో డైరెక్టర్ వంశీ ఒక సినిమా చేద్దామని అనుకున్నారట. దాని పేరే ప్రేమించు పెళ్ళాడు. ఉషా కిరణ్ మూవీస్ అప్పట్లోనే నిర్మాణం మొదలుపెట్టిన రోజులవి. ఇక అన్వేషణ , సితార వంటి సినిమాల తాలూకు విజయాలలో మునిగితేలుతున్న డైరెక్టర్ వంశీ మళ్లీ హీరోయిన్గా భానుప్రియ నే తన మరో సినిమాలో ఎంచుకున్నాడు.

ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకుంటున్నారు అని రామోజీరావు డైరెక్టర్ వంశీని అడగగా రాజేంద్ర ప్రసాద్ పేరును ప్రస్తావించారు. అబ్బే అంటూ పెదవి విరిచారు రామోజీరావు. అంతే కాదు ఛీ అతడు హీరోగా పనికిరాడు అతడు అక్కర్లేదు అని అనేశారు రామోజీరావు. ఇక అప్పట్లో రామోజీరావు ఆయన ప్రతి సినిమా స్క్రిప్ట్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇక ఆ తర్వాత ఆయన పెద్దగా పట్టించుకోకపోవడంతో నమ్మినవాళ్లే తన సినిమా నిర్మాణానికి సంబంధించి అడ్డంగా ముంచేశారు. ఇకపోతే రాజేంద్రప్రసాద్ ను ఈ సినిమాలో హీరోగా చాలా మంచిగా చూపిస్తానని డైరెక్టర్ వంశీ బలంగా చెప్పడంతో రామోజీరావు సరేనన్నారు. ఇక అది కూడా ఇష్టం లేకుండానే రామోజీరావు రాజేంద్రప్రసాద్ సినిమా తీయడానికి ఒప్పుకున్నాడు.

రామోజీరావుకు ఇష్టం లేదని తెలుసుకున్న వంశీ రాజేంద్ర ప్రసాద్ ను పెట్టి కొన్ని ఫోటోలు తీయించి రామోజీరావుకి చూపించారట. ఇక తర్వాత ఒప్పుకున్న రామోజీరావు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. ఇక తర్వాత రాజేంద్రప్రసాద్ మెల్లిమెల్లిగా సినిమాలలో ఒదిగిపోయారు. ఇకపోతే తన కెరీర్ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉండడం గమనార్హం. నట కిరీటగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆనాడు రామోజీరావు చేత అవమానించబడ్డాడు అని తెలియడంతో రాజేంద్రప్రసాద్ అభిమానులు కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version