ఇండియా కూటమిలో కాంగ్రెస్ వద్దు : సంజయ్ సింగ్

-

దేశ రాజధాని ఢిల్లీ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియ కూటమి నుంచి కాంగ్రెస్ దూరం పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ  కి లభ్యం చేకూరేందుకు కాంగ్రెస్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బీజేపీ స్క్రిప్ట్ ను చదివారు.  ఆయన హద్దులు దాటి మా పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

24 గంటల్లో పార్టీ ఆయన పై చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించేందుకు ఇతర పార్టీలతో మాట్లాడతామని ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్కొన్నారు. దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆప్ ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2013లో 40 రోజుల పాటు ఆప్ కి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ చేసిన అతి పెద్ద తప్పిదమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version