సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం : సీఎం రేవంత్ రెడ్డి

-

సినీ ఇండస్ట్రీలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మంత్రి వర్గ ఉప సంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుందని తెలిపారు.

రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, టికెట్ రేట్ల పెంపు పై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపట్టనుంది. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించిన నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులు తమ సూచనలను ఉప సంఘం దృష్టికీ తీసుకెళ్లనున్నారు. సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చిస్తామని దిల్ రాజు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు.  అది రీచ్ అవాలని చూస్తున్నాం.. సంక్రాంతి సినిమాలు, సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అది ఇంపార్టెంట్ కాదు అని తెలిపారు దిల్ రాజు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version