టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మహేష్ బాబుకు మరోసారి నోటీసులు అందాయి. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబుకు తాజాగా రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్ సంస్థను మొదటి ప్రతివాదిగా చేర్చింది.

అలాగే యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా పేర్కొంది. ఇక ప్రచారకర్త టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ను మూడవ ప్రతివాదిగా చర్చి తాజాగా నోటీసులు జారీ చేసింది. ప్రిన్స్ మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. దీంతో మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. గతంలో కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు మహేష్ బాబు.