తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ పాఠశాలలకు సెలవు అంటూ.. తల్లిదండ్రులకు మెసేజ్లు వస్తున్నాయట. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్ల కు యాజమాన్యాలు ఇవాళ సెలవులు కూడా ప్రకటించాయి. మొహరం సెలవు అంటూ పేరెంట్స్ ఫోన్లకు మెసేజ్లు కూడా పంపించాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొహరం పబ్లిక్ హాలిడే ఆదివారం రోజే ఉందన్న సంగతి తెలిసిందే. అటు పలు స్కూల్లు మాత్రం ఇవాళ సెలవు లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపించాయి. దీంతో విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.