బోయపాటి శ్రీను- రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీ స్టార్ట్..

-

టాలీవుడ్ ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎనర్జిటిక్ స్టార్ రామో పోతినేనితో తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేశారు. బుధవారం మూవీ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ తర్వాత బోయపాటి చేస్తున్న ఫిల్మ్ ఇది.

ఇక రామ్ పోతినేని విషయానికొస్తే..‘ఇస్మార్ట్ శంకర్’ ఫిల్మ్ తర్వాత రామ్…మాస్ హీరోగా అవతారమెత్తాడు. తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకుని మాస్ స్టోరిస్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇటీవల లింగు స్వామితో ‘ద వారియర్ ’ ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ చేసిన రామ్..అప్పుడే బోయపాటి సినిమా చేసేస్తున్నారు.

ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9గా శ్రీనివాసా చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహుర్తపు సన్నివేశానికి బూరుగుపల్లి శివరామకృష్ణ స్విచ్ఛాన్ చేయగా, స్రవంతి రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి..‘ది వారియర్’ తర్వాత మరో ఫిల్మ్ రామ్ పోతినేనితో చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తామని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version