తెలంగాణలో రోజురోజుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారం కోసం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కాషాయ పార్టీ కొత్త ఎత్తుగడలను మొదలు పెట్టింది. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుండటంతో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు సమావేశాల నిర్వహణ పనుల పరిశీలనపై బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్. సంతోష్ హైదరాబాద్ నగరానికి బుధవారం చేరుకున్నారు.
తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. జూలై 3వ వారంలో 15వ తేదీ తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉండవచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ పాల్గొననున్నారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం వేస్తుండటంతో రాజకీయ వేడి మరింతగా హీటెక్కింది. దాదాపు 300 నుంచి 500 వరకు బీజేపీ సీనియర్లు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.