ఆ కేసుతో నాకు సంబంధం లేదు: ర్యాపర్​ బాద్​షా

-

సోషల్​మీడియాలోని నకిలీ ఫాలోవర్స్​ కుంభకోణంలో తన ప్రమేయం లేదని ర్యాపర్​ బాద్​షా స్పష్టం చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులకు తాను సహకరించానని, తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని​ తేల్చి చెప్పాడు.ఇటీవలే విడుదలైన బాద్​షా మ్యూజిక్​ ఆల్బమ్​కు నకిలీ లైక్​లు, ఫాలోవర్స్​తో ప్రచారం చేశారనే ఆరోపణలపై తనను క్రైమ్​ ఇంటిలిజెన్స్​ విభాగం​ (సీఐయూ) శుక్రవారం, దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించినట్లు చెప్పాడీ ర్యాపర్. శనివారం మరోసారి విచారణకు హాజరయ్యానని అన్నాడు.నకిలీ ఫాలోవర్స్ కేసులో బాద్షాను ఆదివారం మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 20 మందిని ముంబయి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.

నాకు అందిన సమన్ల ప్రకారం ముంబయి పోలీసులతో మాట్లాడాను. సోషల్​మీడియాలో నకిలీ ఫాలోవర్స్​ కేసు విచారణలో భాగంగా పోలీసులకు సహకరించాను. నాపై వస్తున్న చాలా ఆరోపణల్లో నిజం లేదు. అలాంటి వాటిలో ఎప్పుడూ చేయదల్చుకోలేదు. నాపై అలాంటి ప్రచారాలు చేసేవారిని అస్సలు క్షమించను. ఈ కేసు చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నారు. అధికారులపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని ర్యాపర్​ బాద్​షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version