జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన యాంకర్ రష్మీ.. సోషల్ మీడియాలో చేసే కామెంట్లతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. రష్మీ ఏదో ఒక పోస్ట్ చేయడం వాటికి నెటిజన్లు కామెంట్లు చేయడం, తిరిగి మళ్లీ కౌంటర్స్ వేయడంతో అవి కాస్తా వైరల్ కావడం, వార్తల్లోకెక్కడం జరుగుతుంది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది.
హోలీ సందర్భంగా రష్మీ చేసిన కామెంట్ చర్చల్లోకి వచ్చింది. ‘హోలీ వస్తుంది. కుక్కలపై రంగులు చల్లకండి. మనపై రంగు పడితే సబ్బుతో కడుక్కోవచ్చు. కానీ అవి ఆ పని చేయలేవు’ అని రష్మి ట్వీట్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ ‘అచ్చా.. ఈద్ సమయంలో ట్వీట్ చేయండి. హోలీ, దీపావళి ఉన్నప్పుడే మన పండగల ప్రతిష్టను తగ్గించేలా మీకు ఇలాంటివి గుర్తుకువస్తాయి’ అని కౌంటర్ వేశాడు.
ఇలాంటి అర్థంలేని చెత్త కామెంట్లు చేసేటప్పుడు ఒకసారి చేసిన ట్వీట్లు అన్ని జాగ్రత్తగా చూడు అంటూ సదరు నెటిజన్‌కు రివర్స్ కౌంటర్ వేసింది. ఉమెన్స్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ న్యాయం కోసం ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్న నా దేశంలో మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరు పెడుతున్న ఫొటోను షేర్ చేసింది.