కార్మికుల శ్రేయస్సు కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారు : కేటీఆర్

-

కార్మికుల శ్రేయస్సు కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  తాజాగా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల శ్రేయస్సు కోసం మాజీ సీఎం కృషి చేశారని తెలిపారు. ఓ పక్క కరోనా వంటి కష్ట సమయంలో వలస కార్మికులను కూడా ఆయన ఆదుకున్నారని తెలిపారు. గతంలో కేంద్రంలో కార్మిక శాఖను కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు.

కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జీహెచ్ఎంసీలోని కార్మికులకు మూడు సార్లు జీతాలు పెరిగాయని.. రాష్ట్రంలోని కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంగన్ వాడీ టీచర్ల జీతం 13500లకు పెంచామని.. ఆశావర్కర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వమే జీతం పెంచిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లపై లాఠీలతో దాడి చేయించిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్తితి లేదని.. ఆర్పీలకు గత ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news