హీరోయిన్లు సినిమాలతో పాటుగా వ్యాపార రంగంలోకి కూడా దిగుతున్నారు. నయనతార, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటి రష్మిక మందన కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘డియర్ డైరీ’ పేరుతో ఆమె పెర్ఫ్యూమ్ బ్రాండ్ ను లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రష్మిక ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది. అయితే ఇది ఓ బ్రాండ్ లేదా పెర్ఫ్యూమ్ మాత్రమే కాదని తనలోని ఓ భాగం అంటూ ఆమె వెల్లడించారు.

కాగా, వీటి ధరలు రూ. 1600 నుంచి రూ. 2600 గా ఉన్నాయి. ఇదిలా ఉండగా… నటి రష్మిక వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దూసుకుపోతోంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిన్నది వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో రష్మిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.